కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే ప్రమాద ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే కారు ప్రమాద ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 24 Feb 2024 16:45 IST

హైదరాబాద్‌: ప్రజా జీవితంలో నిత్యం తీరిక లేకుండా గడిపే రాజకీయ నాయకులు సమయం చూసుకోకుండా ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. ఇదే ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే ప్రమాద ఘటనతో ప్రముఖుల ప్రయాణాలపై చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. సుమోటోగా తీసుకుని ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రవాణాశాఖ ఎక్కడికక్కడ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతిభ లేని డ్రైవర్లను విధుల్లో పెట్టుకోవద్దని మంత్రి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని