Telangana: టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామా

టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ బాధ్యతల నుంచి ప్రభాకరరావు వైదొలిగారు.

Updated : 04 Dec 2023 14:37 IST

హైదరాబాద్‌: టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ బాధ్యతల నుంచి ప్రభాకరరావు వైదొలిగారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రభాకర్‌రావు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభాకర్‌రావు సీఎండీగా నియమితులయ్యారు. ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ ఓటమి పాలైన నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు