TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. విచారణకు హాజరైన 37 మంది నిందితులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leakage Case)లో న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.

Updated : 15 Sep 2023 20:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper Leakage Case)లో న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. విచారణకు ఈ కేసులో 37 మంది నిందితులు హాజరయ్యారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, డాఖ్యా నాయక్‌, రాజేశ్వర్‌తో పాటు మిగతా నిందితులు హాజరయ్యారు. గత నెలలో కోర్టులో సిట్‌ అధికారులు ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. అభియోగ పత్రంలో 37 మందిని సిట్‌ అధికారులు నిందితులుగా చేర్చారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 105 మందిని సిట్‌ అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ మినహా మిగతా నిందితులకు ఇప్పటికే నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో సిట్‌ అధికారులు త్వరలో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని