TSRTC: అందుబాటులోకి 22 ఎలక్ట్రిక్‌ బస్సులు.. ప్రారంభించిన మంత్రులు

టీఎస్‌ఆర్టీసీ (TSRTC)లో కొత్తగా 22 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. 

Updated : 12 Mar 2024 13:53 IST

హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ (TSRTC)లో కొత్తగా 22 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్‌ బస్సును మంత్రి కోమటిరెడ్డి స్వయంగా నడిపారు.

అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్న మొత్తం 500 బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయి. ఇవన్నీ నాన్‌ ఏసీ బస్సులే. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వస్తున్న బస్సులని గ్రేటర్‌ అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల్లోనూ మహిళలు ఆధార్‌ కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. నగరంలోని అన్ని ప్రాంతాలకు నడుస్తాయి. ఛార్జింగ్‌ కోసం బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌, కంటోన్మెంట్‌, హెచ్‌సీయూ, రాణిగంజ్‌ డిపోల్లో 33 కేవీ పవర్‌ లైన్లు తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా 565 డీజిల్‌ బస్సులు సమకూర్చుకుంటోంది. ఇందులో 125 మెట్రో డీలక్స్‌లుంటాయి. ఇవన్నీ జూన్‌లో అందుబాటులోకి వస్తాయి. మరో 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కాగా 140 ఆర్డినరీ బస్సులు. ఈ బస్సులన్నిటిలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు