TSRTC: ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు: ఎండీ సజ్జనార్‌

దుండగుల చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని సంస్థ ఎండీ సజ్జనార్ పరామర్శించారు.

Published : 07 Feb 2024 22:18 IST

హైదరాబాద్‌: దుండగుల చేతిలో దాడికి గురై తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని సంస్థ ఎండీ సజ్జనార్ పరామర్శించారు.  వారి ఆరోగ్య పరిస్థితి, దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కండక్టర్, డ్రైవర్‌కు సంస్థ అండగా ఉంటుందని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా సజ్జనార్‌ హెచ్చరించారు. పోలీసు శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే విధంగా ఈ తరహా దాడులను పాల్పడితే యాజమాన్యం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని