TSRTC: సీసీ టీవీల్లో పరిశీలించి.. రద్దీకి అనుగుణంగా సంక్రాంతి బస్సులు

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

Published : 11 Jan 2024 11:02 IST

హైదరాబాద్‌: సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం షామియానాలు, కుర్చీలు, తాగునీరు, మొబైల్ టాయిలెట్‌ల సదుపాయం కల్పించింది. ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ వద్ద కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, బస్‌భవన్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసింది. వీటి ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలించి దానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ‘ఎక్స్‌(ట్విటర్‌)’లో పోస్ట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు