TTD: శ్రీవాణి ట్రస్టు నిధులతో 2,445 నూతన ఆలయాల నిర్మాణం: తితిదే ఛైర్మన్‌

తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశ తీర్మానాలను తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.

Updated : 19 Jun 2023 20:06 IST

తిరుమల: శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంతో 2,445 నూతన ఆలయాల నిర్మాణం చేపడతామని తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగంపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశ తీర్మానాలను తితిదే ఛైర్మన్‌ మీడియాకు వివరించారు.

సమావేశ తీర్మానాలివే..

  • రూ.4.16 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం. 
  • రూ.40.50 కోట్లతో వ్యర్థాల నిర్వహణ కోసం ప్రైవేటు ఏజెన్సీకి అనుమతి.
  • ఒంటిమిట్ట రామాలయంలో దాతల సాయంతో రూ.4 కోట్లతో అన్నదాన భవనం. 
  • తిరుమలలో రూ.3.55 కోట్లతో పోలీసు క్వార్టర్స్‌ ఆధునికీకరణ.
  • శ్రీవెంకటేశ్వర వేదిక్‌ విశ్వవిద్యాలయంలో రూ.5 కోట్లతో వసతి గృహాలు.
  • రూ.7.44 కోట్లతో తితిదే పరిధిలో ఆధునిక కంప్యూటర్లు.
  • రూ.9.5 కోట్లతో తిరుపతిలో సెంట్రలైజ్డ్‌ గోదాం.
  • రూ.97 కోట్లతో స్విమ్స్‌ ఆస్పత్రి ఆధునికీకరణకు ఆమోదం.
  • రూ.6.65 లక్షలతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి పుష్కరిని ఆధునికీకరణ.
  • శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఖండిస్తూ తీర్మానం.
  • శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా దాదాపు 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ. 
  • గోశాలల నిర్వహణ, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు శ్రీవాణి నిధులు కేటాయిస్తున్నాం.
  • రాజకీయ లబ్ధికోసం తితిదేపై దుష్ప్రాచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని