Tirumala-TTD: భక్తుల లగేజీ విధానంలో తితిదే కొత్త మార్పులు

భక్తుల లగేజీ విధానంలో తితిదే కొత్త మార్పులు తెచ్చింది. దాతల సహకారంతో ఓ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసింది. లగేజీ సెంటర్‌కు బాలాజీ బ్యాగేజ్‌ సెంటర్‌గా నామకరణం చేసింది.

Updated : 22 Aug 2023 12:41 IST

తిరుమల: శ్రీవారి భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) లగేజీ విధానంలో అధునాతన మార్పులు తీసుకొని వచ్చింది. లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు తితిదే సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దింది. లగేజీ సెంటర్‌కు బాలాజీ బ్యాగేజ్‌ సెంటర్‌గా నామకరణం చేసింది. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ..

కాలిబాటలో వచ్చే భక్తుల లగేజీని తిరుపతిలో తీసుకొని తిరుమలలో మ్యానువల్‌గా ఇచ్చే విధానం ఉండేదన్నారు. కొవిడ్‌కు ముందు కొంతకాలం లగేజీ సెంటర్‌ను కాంట్రాక్టుకు ఇచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ఎయిర్ పోర్ట్ తరహాలో భక్తులకు సేవలు అందించేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను దాతల సహకారంతో విజిలెన్స్ అధికారులు తయారు చేశారన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్, 300 ప్రత్యేక దర్శనం, శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్ల మార్గంలో ఈ ఉచిత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లగేజీ కేంద్రాల్లో టికెట్ స్కాన్ చేయగానే భక్తుల లగేజీ ఎక్కడ ఉందో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ మేరకు బాలాజీ బ్యాగేజ్ సెంటర్ల ద్వారా లగేజీని అందజేస్తామని ఈవో వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని