AP News: అప్పన్న స్వామికి చందన సమర్పణ.. సింహాచలంలో భక్తుల రద్దీ

వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.

Updated : 23 May 2024 14:11 IST

సింహాచలం: వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో అప్పన్న స్వామికి రెండో విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున రెండు గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రభాత సేవలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ముందుగా సిద్ధం చేసుకుని ఉంచిన శ్రీ గ్రంధాన్ని స్వామికి సమర్పణ చేశారు. వైశాఖ పౌర్ణమి ఉత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అడివివరంలోని వరాహ పుష్కరిణి చెరువు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని