Taraka Ratna: తారకరత్న మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోంది: విజయసాయిరెడ్డి

తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలు బాగున్నాయని, మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 

Updated : 01 Feb 2023 17:50 IST

బెంగళూరు: సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వచ్చిన ఆయన.. తారకరత్న ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రి సిబ్బంది మంచి వైద్య సేవలందిస్తున్నారని తెలిపారు. తారకరత్న గుండెతో పాటు ఇతర అవయవాలు బాగున్నాయని, మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోందని వెల్లడించారు. త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. బాలకృష్ణ దగ్గరుండి వైద్య సేవలు చూసుకుంటున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు