Vijayawada: విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

ఈనెల 21 నుంచి ఆగస్టు 15 వరకు విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

Updated : 11 Jun 2024 19:35 IST

విజయవాడ: విజయవాడ రైల్వే డివిజన్‌లో ట్రాక్‌ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 15 వరకు విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లు రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 28 వరకు ఎనిమిది రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు. 11 రైళ్లను దారి మళ్లించనున్నారు. పాక్షికంగా రద్దు చేసిన రైళ్లను రామవరప్పాడు స్టేషన్‌ వరకు నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని