TG News: తెలంగాణలో 10వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు: సీఈవో వికాస్‌రాజ్‌

జూన్‌ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లు, 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు.

Published : 01 Jun 2024 14:42 IST

హైదరాబాద్‌: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్‌ఫోన్లు వినియోగించేందుకు అనుమతిలేదని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లవద్దని సూచించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో ప్రతి మూల కవర్‌ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లు, 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని తెలిపారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో, అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో 2,400 మందికి పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10వేల మంది సిబ్బంది పాల్గొంటారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు