వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర లక్ష్యసాధనలో ప్రజలే ప్రచారకర్తలు: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర లక్ష్యసాధనలో ప్రజలే ప్రచారకర్తలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ అన్నారు.

Updated : 09 Dec 2023 22:39 IST

విజయవాడ: వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర లక్ష్యసాధనలో ప్రజలే ప్రచారకర్తలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని తెలిపారు. విజయవాడ గ్రామీణ మండలం రాయనపాడులో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు.

ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఇన్ఫర్మేషన్‌, ఎడ్యుకేషన్‌, కమ్యూనికేషన్‌ వాహనాన్ని పరిశీలించారు. ఆయుష్మాన్‌ భారత్‌, ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్యయోజన, పోషణ్ అభియాన్‌, ఉజ్వల 2.0, పీఎం ఆవాస్‌ యోజన తదితర స్టాళ్లను సందర్శించారు. వివక్షకు తావులేకుండా సబ్‌కాసాత్‌ సబ్‌కావికాస్‌ నినాదంతో 2047 లోపు భారత్‌ను బాగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దాలనే సంకల్పంతో ప్రధాని విశేష కృషి చేస్తున్నారని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రహోం మంత్రి తానేటి వనిత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని