Kurnool: నిలకడగా ఎంపీ అవినాష్‌ తల్లి ఆరోగ్యం.. నేడు డిశ్చార్జ్‌

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కానున్నారు. అనారోగ్య కారణాలతో ఈనెల 19న ఆమెను కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.

Updated : 26 May 2023 12:14 IST

కర్నూలు: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కానున్నారు. అనారోగ్య కారణాలతో ఈనెల 19న ఆమెను కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా చికిత్స అందించిన వైద్యులు తాజాగా మరో హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇవాళ డిశ్చార్జ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. డిశ్చార్జ్‌ అనంతరం ఆమెను హైదరాబాద్‌ తరలించనున్నట్లు సమాచారం.

మరోవైపు ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు హైదరాబాద్‌ బయల్దేరారు. తల్లి ఆరోగ్యం మెరుగుపడిన నేపథ్యంలో కర్నూలు నుంచి ఆయన వెళ్లారు. అవినాష్‌ హైదరాబాద్‌ బయల్దేరిన సమయంలో పెద్ద ఎత్తున ఆయన అనుచరులు అక్కడికి చేరుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని