Andhra news: పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్స్‌’.. ఏపీ విద్యాశాఖ ఆదేశాలు

ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్స్‌’ మోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

Updated : 02 Apr 2024 19:49 IST

అమరావతి: ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్‌ బెల్స్‌’ మోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్‌ ముప్పును నివారించేందుకు రోజులో మూడు సార్లు బెల్స్‌ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8.45, 10.50, 11.50కి గంట కొట్టాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చినట్లుగా 5 నిమిషాల పాటు వాటర్‌ బ్రేక్‌ ఇవ్వనున్నారు. 2019లో దేశంలో మొదటిసారి ఈ విధానాన్ని కేరళలోని కొని బడుల్లో ప్రారంభించారు. అక్కడ మంచి స్పందన రావడంతో వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని