Health: టీ తాగితే గుండెకు మేలేనా?
చాలామందికి ‘టీ’ తాగకపోతే ఆ రోజే ప్రారంభం కాదు. నిద్ర లేచీ లేవగానే తేనీటి చుక్క నాలిక మీద పడాల్సిందే. మరికొందరు రోజులో కనీసం నాలుగైదు సార్లు చాయ్ తాగేస్తుంటారు.
ఇంటర్నెట్‌డెస్క్: చాలామందికి ‘టీ’ తాగకపోతే ఆ రోజే ప్రారంభం కాదు. నిద్ర లేచీ లేవగానే తేనీటి చుక్క నాలిక మీద పడాల్సిందే. మరికొందరు రోజులో కనీసం నాలుగైదు సార్లు చాయ్ తాగేస్తుంటారు. లేకుంటే ఏదో కోల్పోయినట్లుంటుందని చెబుతుంటారు. అయితే ఇలా ఎక్కువ సార్లు టీ తాగడం మంచిదేనా? దీనివల్ల గుండెపై ఏమైనా ప్రభావం పడుతుందా?
చాయ్ తాగడం వల్ల ఓ రకంగా గుండెకు మేలే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయంగానూ ఇది నిరూపితమైంది. ఎక్కువగా టీ తాగుతున్న దాదాపు లక్ష మందిపై ఏడేళ్లపాటు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. సాధారణ ప్రజలకంటే వీరిలో గుండె సంబంధిత వ్యాధులు 20 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఒకవేళ గుండె వ్యాధులు వచ్చినా మరణించే సందర్భాలు 22 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఈ మేరకు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో కథనం ప్రచురితమైంది. మరోవైపు జపాన్ దేశానికి చెందిన దాదాపు 40 వేల మందిపై శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. రోజుకు కనీసం 5 కప్పుల గ్రీన్ టీ తీసుకున్నవారిలో గుండెపోటుతో మరణించే అవకాశాలు దాదాపు 26 శాతం తక్కువగా ఉన్నట్లు అందులో తేలింది. ఈ మేరకు అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో కథనం ప్రచురితమైంది.
గుండెకు టీ ఎలా మేలు చేస్తుంది?
టీ తాగడం వల్ల గుండెకు ఏవిధంగా మంచిదో తెలుసుకునే ముందు.. అధిక రక్తపోటు హృదయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. గుండె నుంచి శరీర భాగాలకు, శరీర భాగాల నుంచి గుండెకు నిరంతరం రక్తం సరఫరా అవుతుంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా అవి పగిలిపోవడం, చిల్లులు పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ఒత్తిడికి గురైన సందర్భాల్లో అధికంగా రక్తం సరఫరా అవుతుంది. అలాంటప్పుడు అవసరాన్ని బట్టి రక్తనాళాలు కొంచెం సాగుతూ ఉంటాయి. కానీ అధిక రక్తపోటు ఉన్నవారిలో అలా జరగదు. రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తం గడ్డ కడుతుంది. ఫలితంగా ఛాతి భాగంలో నొప్పితోపాటు, హృదయ సంబంధమైన వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాలిఫెనాల్ పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి రక్తనాళాలను వదులుగా ఉంచేందుకు తోడ్పడుతాయి. అంతేకాకుండా రక్తకణాల లోపలి పొరల్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్తేజపరచేందుకు ఈ పాలిఫెనాల్ ఉపయోగపడుతుంది. ఫలితంగా రక్త ప్రసరణ సజావుగా సాగి హృదయం ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. ప్రస్తుతం రకరకాల చాయ్‌లు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. మరోవైపు రక్తంలో పేరుకుపోయిన ప్రమాదకరమైన కొవ్వు కణాలను కరిగించేందుకు బ్లాక్ టీ ఎంతగానో సహాయపడుతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Team India: ధావన్ వస్తాడా...? ఇషాన్‌కే అవకాశాలు ఇస్తారా..? అశ్విన్ స్పందన ఇదీ..
-
General News
CM Jagan: త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
-
India News
Economic Survey 2023: లోక్‌సభ ముందు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Ileana: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్
-
India News
Droupadi Murmu: ధైర్యవంతమైన ప్రభుత్వం.. విప్లవాత్మక నిర్ణయాలు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము