Viral Video: ‘ఎయిర్‌పోర్ట్‌నూ వదలరా’.. రీల్స్‌ కోసం యువతి విన్యాసాలపై నెటిజన్ల రియాక్షన్‌

Viral Video: ఎయిర్‌పోర్టులో రీల్స్‌ చేసిన ఓ యువతిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌నూ వదలరా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Updated : 30 Mar 2024 20:40 IST

Viral Video | ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు కొందరు చేస్తున్న విన్యాసాలు విమర్శలకు తావిస్తున్నాయి. లైక్స్‌, కామెంట్స్‌, వ్యూస్‌ మోజులో పడి కొందరు బహిరంగ ప్రదేశాల్లో చేసే చిత్ర, విచిత్ర చేష్టలు.. ఎంతోమందికి చిరాకు తెప్పిస్తున్నాయి. తాజాగా విమానాశ్రయంలో ఓ యువతి చేసిన విన్యాసం సైతం అలానే విమర్శల పాలైంది. ఆఖరికి ఎయిర్‌పోర్టునూ వదలరా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘అసలేంటిది’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

సుజాతా దహల్‌ అనే మహిళ విమానాశ్రయంలో రికార్డ్ చేసిన వీడియోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ఆ వీడియోలో కదులుతున్న లగేజీ కన్వేయర్‌ బెల్ట్‌పై ఆమె పడుకోవడం కనిపించింది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వెంటనే ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో సుజాత ప్రవర్తించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

‘ఎయిర్‌పోర్ట్‌నైనా వదలొచ్చు కదా’ అంటూ ఓ వ్యక్తి కామెంట్‌ చేశాడు. ‘ఇలాంటి పనులు చేసే వారికి లక్షల్లో జరిమానా విధించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. ‘నాకు తెలిసిన వ్యక్తి ఇలా చేసే తన చేతి వేళ్లు పోగొట్టుకున్నాడు’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ రూపంలో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ‘పొరపాటున మీ జుట్టు ఆ బెల్ట్‌లో ఇరుక్కుపోతే పరిస్థితేంటని ఆలోచించావా?’ అంటూ మరో యువతి కామెంట్ పెట్టింది. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటివరకు 23.6 మిలియన్ల వ్యూస్‌ లభించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు