TSRTC: మహాలక్ష్మి పథకం.. రికార్డు స్థాయిలో మహిళల ప్రయాణం

మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సుల్లో రికార్డు స్థాయిలో మహిళలు ప్రయాణించారు.

Published : 08 Feb 2024 20:32 IST

హైదరాబాద్: మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బస్సుల్లో రికార్డు స్థాయిలో మహిళలు ప్రయాణించారు. గతేడాది డిసెంబర్ 9 నుంచి ఈనెల 6 వరకు 15.21 కోట్ల మంది ప్రయాణించినట్టు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఉచిత ప్రయాణం ద్వారా వారికి దాదాపు రూ.535.52 కోట్ల మేర రవాణా ఛార్జీలు ఆదా అయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి రూ.300 కోట్లు  ఆర్టీసీకి కేటాయించిందని సజ్జనార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని