Vijayawada: పవన్‌ తొలిప్రేమ రీరిలీజ్‌.. థియేటర్‌లో యువకుల అత్యుత్సాహం

విజయవాడలోని కపర్థి థియేటర్‌లో పవన్‌ కల్యాణ్‌ చిత్రం తొలిప్రేమ రీరిలీజ్‌ సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

Updated : 01 Jul 2023 13:35 IST

విజయవాడ: విజయవాడలోని కపర్థి థియేటర్‌లో పవన్‌ కల్యాణ్‌ చిత్రం తొలిప్రేమ రీరిలీజ్‌ సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శుక్రవారం రాత్రి సెకండ్‌ షో సమయంలో అభిమానులు బీభత్సం సృష్టించినట్లు తెలుస్తోంది. థియేటర్‌లో సినిమా తెరను చించేసి, సీట్లను ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు. అడ్డొచ్చిన థియేటర్‌ సిబ్బందిపై యువకులు దాడికి దిగారు. దీనిపై థియేటర్‌ యాజమాన్యం స్పందిస్తూ.. విధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని యాజమాన్యం కోరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని