YSRCP: కుప్పంలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు.. ఆర్టీసీ బస్సుపై దాడి, వ్యాపారులకు బెదిరింపులు!

చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. నిరసనలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుపై దాడికి పాల్పడ్డారు.

Updated : 05 Aug 2023 13:44 IST

కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా అల్లరి మూకలు బీభత్సం సృష్టించాయి. నిరసనలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుపై దాడికి పాల్పడ్డారు. 40 మందితో కుప్పం డిపో బస్సు కృష్ణగిరి నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సులో ఉన్న తమిళనాడుకు చెందిన ప్రయాణికులు  తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం వరకు ఆర్టీసీ బస్టాండ్‌లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.  ఈ దాడిలో బస్సు పాక్షికంగా దెబ్బతింది.  

కాగా పుంగనూరు దాడి ఘటనకు నిరసనగా నేడు వైకాపా బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ముందస్తు ప్రకటన లేకుండా బస్సులు నిలిపివేతతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కుప్పంలో బంద్ పాటించాలంటూ వైకాపా కార్యకర్తలు  దుకాణాలను బలవంతంగా ముసివేయించారు. ఓ వస్త్ర దుకాణంలోని వస్త్రాలను బయటపడేసి బెదిరింపులకు పాల్పడ్డారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని