Mahakaleshwar Temple: ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం..!

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో ప్రధాన పూజారి గాయపడ్డాడు. 

Published : 25 Mar 2024 10:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయం (Mahakaleshwar Temple)లో నేడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 13 మంది గాయపడినట్లు తెలుస్తోంది. హోలీ పర్వదినం సందర్భంగా ప్రధాన గోపురం కింద ఉన్న గర్భగృహంలో భస్మహారతి కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. 

ఆలయంలో స్వామికి గులాల్‌ను సమర్పిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వస్త్రం వంటిది అంటుకొని పూజారులు, భక్తులపై పడింది. ఈ విషయాన్ని ఆలయ పూజారి ఆశీష్‌ కూడా ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది గాయపడటంతో వారిని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు కలెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఇందౌర్‌ తీసుకెళ్లారు. బాధితుల్లో ఆలయ ప్రధాన పూజారి సంజయ్‌ గౌర్‌ కూడా ఉన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.  ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి. 

రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కుమారుడు, కుమార్తె త్రుటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో వారు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని