NEET UG: నీట్‌-యూజీ తుది ఫలితాల వెల్లడి

Eenadu icon
By National News Desk Published : 27 Jul 2024 04:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

61 నుంచి 17కు తగ్గిన టాపర్ల సంఖ్య

దిల్లీ: పేపర్‌ లీక్‌ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్‌-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్‌) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) శుక్రవారం విడుదల చేసింది. గతంలో వెల్లడించిన మార్కులతో 61 మంది టాపర్లుగా నిలవగా, సవరించిన మార్కులతో ఆ సంఖ్య 17కు తగ్గింది. మరోవైపు వేల మంది విద్యార్థుల మార్కులు, ర్యాంకుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. అర్హత సాధించిన వారి సంఖ్య, కటాఫ్‌ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఫిజిక్స్‌ సబ్జెక్టులో ఓ ప్రశ్నకు సంబంధించిన జవాబుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సరైన సమాధానాన్ని సూచించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. అది సూచించిన జవాబును పరిగణనలోకి తీసుకొని మళ్లీ మూల్యాంకనం చేసి తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఈ క్రమంలో 4,20,000 మంది విద్యార్థుల మార్కులు 5 పాయింట్ల మేర తగ్గాయి. వారిలో 720కి 720 మార్కులు సాధించిన 61 మంది విద్యార్థుల్లోని 44 మంది కూడా ఉన్నారు. ఇది వారి ర్యాంకులపై ఏ మేర ప్రభావం చూపుతుందన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తొలి 100 మందిలో నిలిచినవారిలో ఆరుగురికి 716 మార్కులు రాగా, 77 మందికి 715 మార్కులు వచ్చాయి. 13,15,853 మంది క్వాలిఫై కాగా, గత జాబితాతో పోలిస్తే 415 మంది అర్హత సాధించలేకపోయారు. తాజా ఫలితాల్లో జనరల్, ఆర్థికంగా బలహీన వర్గాలకు కటాఫ్‌ 720-162 మధ్య ఉండగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 161-127 మధ్య ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు