Maharashtra Madarasa: వాచీ దొంగలించాడని 16 ఏళ్ల విద్యార్థిపై ఉమ్ము వేయిస్తూ చితకబాదిన ఉపాధ్యాయుడు

వాచీ దొంగలించాడనే కారణంతో విద్యార్థిపై ఉపాధ్యాయుడు కర్కశంగా ప్రవర్తిస్తూ విచక్షణారహితంగా అతడిపై దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Published : 01 Mar 2024 18:39 IST

ఔరంగాబాద్: ఓ పదహారేళ్ల విద్యార్థి వంద రూపాయల విలువైన వాచీని దొంగతనం చేశాడని ఉపాధ్యాయుడు అతడిపై ఇతర విద్యార్థులతో ఉమ్ము వేయిస్తూ చితకబాదిన అమానవీయ ఘటన మహారాష్ట్రలోని ఓ మదర్సా(Madarasa)లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూరత్‌కు చెందిన విద్యార్థి ఔరంగాబాద్‌లోని జామియా బుర్హానుల్ ఉలూమ్ మదర్సాలో చదువుకుంటున్నాడు. అతడు సమీపంలోని దుకాణం నుంచి వాచీ దొంగిలించాడని ఆ దుకాణదారు మదర్సాలోని ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దొంగలించిన వాచీని విద్యార్థి వద్ద గుర్తించిన మతగురువు(cleric) మౌలానా సయ్యద్ ఒమర్ అలీ ఆ యువకుడిని అర్థనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టి తాను కొట్టడమే కాకుండా సహ విద్యార్థులు అందరితో వరుసగా అతడిపై ఉమ్ము వేయిస్తూ తీవ్రంగా కొట్టించాడు.  ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బాధితుడి కుటుంబానికి దొరకడంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు మతపెద్దపై మైనర్ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ దాడిలో పాల్గొన్న మైనర్‌ యువకులకు కౌన్సెలింగ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని