Tejashwi Yadav: మోసం చేసి రూ.200 తీసుకున్నారంటూ.. తేజస్వీ యాదవ్‌పై కేసు!

ఇంటర్నెట్‌డెస్క్: మరికొన్ని రోజుల్లో బిహార్(Bihar)లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. ఈక్రమంలో ఓ కొత్త వివాదం తెర పైకి వచ్చింది. మోసం చేసి రూ.200 తీసుకున్నారంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)పై ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగిందంటే.. సింగ్వారాకు చెందిన గుడియా దేవి అనే మహిళ ఈ ఫిర్యాదు చేశారు. ఆమె ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మై-బెహన్ యోజన కింద మహిళలకు రూ.2,500 హామీ పథకం కోసం దరఖాస్తు చేయిస్తామంటూ తన వద్ద నుంచి రూ.200 తీసుకున్నారని ఆమె ఆరోపించింది. దీనికి సంబంధించి పలువురు మహిళల నుంచి ఆధార్, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలను కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఈక్రమంలో తేజస్వీయాదవ్, రాజ్యసభ ఎంపీ సంజయ్‌యాదవ్ సహా పలువురిపై ఆమె ఫిర్యాదు చేశారు.
ఈక్రమంలోనే అధికార సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేశారంటూ మరో ఫిర్యాదు కూడా నమోదైంది. మిథిలా తోలా రాంపుర్‌కు చెందిన చంద్రికా దేవీ అనే మహిళ ఈ ఫిర్యాదు చేశారు. వితంతు పింఛన్ పథకంలో మోసం జరిగిందని ఆమె ఆరోపించారు. కేసు నమోదు వివరాలను పోలీసులు కూడా ధ్రువీకరించారు. ఇక, వీటిపై ప్రతిపక్ష నేతలెవరూ ఇప్పటివరకు స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 


