Chennai: ఫుడ్‌ పాయిజనింగ్‌.. 42 మంది బీటెక్‌ విద్యార్థులకు అస్వస్థత

కలుషితాహారం తిని 42 మంది బీటెక్‌ విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన చెన్నైలోని ఈరోడ్‌లో చోటుచేసుకుంది.

Published : 02 Jun 2024 20:08 IST

(ప్రతీకాత్మక చిత్రం)

ఈరోడ్‌: తమిళనాడులోని చెన్నైలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషితాహారం తిని అస్వస్థతకు గురి కావడంతో ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి భోజనం చేసిన విద్యార్థులు అసౌకర్యానికి గురై.. వాంతులు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఫుడ్‌పాయిజనింగ్‌ అయినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.  వారందరినీ ఈరోడ్‌ జిల్లా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని