Cyclone Remal: ‘రెమాల్‌’ బీభత్సం.. దెబ్బతిన్న 48 పోలింగ్‌ కేంద్రాలు

రెమాల్‌ తుపాను పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోంది. భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేయగా.. పలు చోట్ల వరదనీటిలో పోలింగ్‌ కేంద్రాలు మునిగిపోయాయి.

Published : 27 May 2024 23:19 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో రెమాల్‌ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ధాటికి ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో 48 పోలింగ్‌ కేంద్రాలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్‌ 1న జరగనున్న లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్‌కు సంబంధించిన సన్నాహాలపైనా ఈ విపత్తు ప్రతికూల ప్రభావం చూపించింది. తుపాను ప్రభావంతో వీటిలో చాలా పోలింగ్‌ కేంద్రాలు వరద నీటిలో మునిగినట్లు అధికారులు తెలిపారు.

తుపాను ప్రభావిత జిల్లాల మెజిస్ట్రేట్‌లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి టెలిఫోన్‌ ద్వారా సమీక్షించారు. తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు మరమ్మతులపై కీలక ఆదేశాలు జారీచేశారు. అధికార యంత్రాంగం నుంచి సమగ్ర నివేదికను కోరారు. మరోవైపు, వర్షపు నీటిని త్వరితగతిన పంపింగ్‌ చేసి.. జూన్‌ 1 నాటికి పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేయించాలని ఆదేశించారు. మరోవైపు, అన్ని జిల్లాల్లో స్ట్రాంగ్‌రూమ్‌ల పరిస్థితిని పరిశీలించి, భద్రత కల్పించాలని ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని