prakash indian tata: 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలకు..

మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్‌ ఇండియన్‌ టాటా 84 ఏళ్ల వయసులో ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.‘‘చదువుకు వయసుతో సంబంధం లేదని భావించాను.

Updated : 27 May 2024 07:54 IST

ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్‌ పట్టుదల

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్‌ ఇండియన్‌ టాటా 84 ఏళ్ల వయసులో ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.‘‘చదువుకు వయసుతో సంబంధం లేదని భావించాను. అందుకే నేను మొదట మధ్యప్రదేశ్‌ ఓపెన్‌ బోర్డు నుంచి ఐదో తరగతి పరీక్షలు రాశాను. ఇప్పుడు ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నా. ఆ తర్వాత 10, ఇంటర్‌ కూడా పూర్తి చేస్తాను’’ అని ప్రకాశ్‌ వెల్లడించారు. ఆయుర్వేద వైద్యంలో మంచి పట్టు సంపాదించిన ఆయన.. సామాన్యుల నుంచి అమితాబ్‌ బచ్చన్‌ తదితర సినీ ప్రముఖులకు, రాజకీయ నాయకులు, అనేక దేశాల వ్యాపారవేత్తలకు సేవలు అందించారు. మొత్తం 112 దేశాల్లో పర్యటించి అక్కడి ప్రజలకు చికిత్స చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని