viral video: ఆటో బుక్‌ చేసుకున్న ప్రయాణికుడు..బిల్లు చూసి షాక్‌

మనం ఒక్కోసారి ఆటో లేదా క్యాబ్‌  బుక్‌ చేసుకున్న సమయంలో మొదట చూపించిన ఛార్జీకి, ప్రయాణం పూర్తయిన అనంతరం చూపించే రుసుముకు తేడా ఉంటుంది. అదనంగా ఇరవై, ముప్పై రూపాయలు అయినా చెల్లిస్తుంటాము. కాని అదే బిల్లు కోట్లలో వస్తే?  ఓ ఉబర్‌ వినియోగదారునికి ఇదే పరిస్థితి ఎదురైంది.   

Updated : 31 Mar 2024 19:06 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: మనం ఒక్కోసారి ఆటో లేదా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నప్పుడు మొదట చూపించిన ఛార్జీకి, ప్రయాణం పూర్తయిన అనంతరం చూపించే రుసుముకు తేడా ఉంటుంది. అదనంగా ఇరవై, ముప్పై రూపాయలు అయినా చెల్లిస్తుంటాము. కాని అదే బిల్లు కోట్లలో వస్తే?  ఓ ఉబర్‌ వినియోగదారునికి ఇదే పరిస్థితి ఎదురైంది.

అసలేమైందంటే.. నోయిడాకు చెందిన  దీపక్‌ టెంగూరియా ఉబర్‌ ఆటోను బుక్‌ చేసుకున్నాడు. ఆ సమయంలో చెల్లించవలసిన మొత్తం రూ.62గా చూపించింది. అనంతరం యాప్‌లో ఏకంగా రూ.7.66కోట్ల బిల్లు చెల్లించాలని నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతో దీపక్‌ నిర్ఘాంతపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అతని స్నేహితుడు ఆశిష్ మిశ్రా ఎక్స్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. పోస్టులో అతడు ‘‘ఉబర్‌ ఆటో బుక్‌ చేసుకున్నందుకు ఆ కంపెనీ నా స్నేహితుడిని గొప్పవాడిని చేసింది. ఈ ఫ్రాంచైజీనే కొనాలనుకుంటున్నాడు. విచిత్రమేంటంటే ట్రిప్ రద్దు కాకపోవడం విశేషం. 62రూపాయలకు ఆటోను బుక్ చేసుకొని మీరు కూడా  కోటీశ్వరులుగా మారండి. ’’అంటూ రాసుకొచ్చారు. 

కంపెనీ పంపిన బిల్లులో వెయిటింగ్‌  చార్జిగా రూ.5,99,09189 చూపించగా, ప్రమోషన్‌ ఖర్చును రద్దుచేశారు.. వీడియోలో ఈ విషయంపై ఆశిష్‌ స్పందిస్తూ చంద్రయాన్‌ నుంచి ఆటోను బుక్‌ చేసినా ఇంత ఖర్చు అయ్యేది కాదంటూ వ్యాఖ్యానించారు.
పోస్టు వైరల్‌ కావడంతో ఉబర్‌ సంస్థ ఎక్స్‌ వేదికగా స్పందించింది. దీపక్‌కు క్షమాపణలు తెలిపింది. సమస్యను పరిశీలిస్తున్నామని తమకు కొంత సమయమివ్వాలని, బిల్లును అప్డేట్‌ చేస్తామని పేర్కొంది. 

వీడియో నెట్టింట వైరలవ్వడంతో నెటిజన్లు స్పందిస్తూ ప్రమోషన్‌ డిస్కౌంట్‌ కింద రూ.75 తగ్గించారు సంతోషపడండి అంటూ చమత్కరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు