Bomb Threat: దిల్లీలో మరో పాఠశాలకు బాంబు బెదిరింపు.. నెలరోజుల్లో మూడో ఘటన

Bomb Threat to School: దిల్లీలోని ఓ పాఠశాలకు ఆగంతకుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో స్కూల్‌ను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు.

Published : 16 May 2023 10:30 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీ(Delhi)లోని ఓ ప్రైవేటు పాఠశాల(Delhi School)కు బాంబు బెదిరింపు(Bomb Threat) రావడం కలకలం సృష్టిస్తోంది. పుష్పవిహార్‌ ప్రాంతంలోని అమృత పాఠశాలకు ఉదయం 6.35 గంటల సమయంలో ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. దీనిపై అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పాఠశాలను ఖాళీ చేయించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

ఇటీవల ఈ తరహాలో దిల్లీలోని పాఠశాలలకు తరచూ బెదిరింపు మెయిల్స్‌ వస్తున్నాయి. సుమారు నెల రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన. ఏప్రిల్‌లో మథురా రోడ్‌లోని దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, సాదిఖ్ నగర్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు ఇలాగే మెయిల్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని