1993 రైలు బాంబు పేలుళ్ల కేసు.. తుండా నిర్దోషి

1993 train bomb blasts: 1993 రైలు బాంబు పేలుళ్ల కేసు నిందితుడు అబ్దుల్ కరీం తుండాను కోర్టు నిర్దోషిగా తేల్చింది.  

Updated : 29 Feb 2024 20:11 IST

దిల్లీ: లష్కరేతొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్‌లోని ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. 1993లో దేశంలో జరిగిన వరుస రైలు బాంబు పేలుళ్ల కేసులో ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా తగిన ఆధారాలు లేవని పేర్కొంది. 1993లో నాలుగు రైళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఆ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ కేసులో తుండాతో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరిని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. ఇదిలాఉంటే.. 1996 బాంబు పేలుళ్ల కేసులో ప్రస్తుతం తుండా జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. పలు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని