విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్‌.. వీడియో వైరల్‌

Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. 

Published : 25 Apr 2024 16:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిన్నారుల ముఖాలు చిరునవ్వుతో విచ్చుకుంటే.. మన ముందు కిలకిలా నవ్వుతుంటే చూసేందుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఓ వీడియో ఇలాంటి అనుభూతినే పంచుతోంది. వారి నవ్వుల కోసం ఓ టీచర్ చేసిన ఫన్నీ యాక్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. తమిళనాడులోని మాంటిస్సోరి పాఠశాలలో బంధించిన ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.(Students smile)

ఆ వీడియోలో కొందరు విద్యార్థులు, టీచర్లు మెట్లపై కూర్చొని ఉంటారు. మరో టీచర్ ఆ పిల్లల నవ్వుల్ని క్యాప్చర్ చేసేందుకు ఫన్నీగా ఆలోచించారు. ఆమె నేలపై ఒక పక్కకు పడుకొని ఉండగా.. మరో మహిళ ఆమెను లాగడం కనిపిస్తుంది. పిల్లల్ని విభిన్నంగా వీడియో తీసేందుకు ఆమె ఇలా చేశారు. అది చూసి చిన్నారుల ముఖాలు వెలిగిపోయాయి. వారంతా పగలబడి నవ్వేశారు. ‘‘ఈ అందమైన నవ్వుల కోసమే’’ అంటూ ఆ క్లిప్‌ కింద ఓ క్యాప్షన్ జత చేశారు. ఇది నెటిజన్లకు అమితంగా నచ్చేసింది. ఇంతకంటే అందమైనది ఏముంటుందని కామెంట్లు పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని