Maneka Gandhi: గాడిద పాలతో సబ్బులు.. మేనకా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్ర మాజీ మంత్రి మేనకాగాంధీ(Maneka Gandhi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Published : 03 Apr 2023 18:38 IST

లఖ్‌నవూ: కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ మేనకా గాంధీ(Maneka Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడిద పాలతో చేసిన సబ్బు మహిళల శరీరాన్ని అందంగా ఉంచుతుందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని సుల్తాన్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

‘క్లియోపాత్ర.. ఆమె ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాణి. ఆమె తరచూ గాడిద పాలతో స్నానం చేసేది. దిల్లీలో ఆ పాలతో తయారయ్యే సబ్బులు ఒక్కొక్కటి రూ.500 ధర పలుకుతున్నాయి. మనమెందుకు మేక, గాడిద పాలతో తయారీని ప్రారంభించకూడదు..?’అని ఆమె మాట్లాడిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. లద్దాఖ్‌ కమ్యూనిటీ ఒకటి సబ్బుల తయారీలో గాడిద పాలను ఉపయోగిస్తోందన్నారు. అలాగే ధరల పెరుగుదల గురించి మాట్లాడారు. చెట్లు కనుమరుగు అవుతున్నాయని, చెక్క కూడా ఖరీదవుతుందన్నారు. దాంతో అంత్యక్రియలు ఖరీదుగా మారతాయని వ్యాఖ్యానించారు. అందుకే చెక్క బదులు ఆవు పేడను ఉపయోగిస్తే.. ధర చాలా మటుకు తగ్గించొచ్చని చెప్పారు. ఇంకా ఆ వీడియోలో ఆమె పలు విషయాలపై మాట్లాడారు. అయితే మేనక((Maneka Gandhi) వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని