Sanjay Singh: సంబరాలు కాదు.. ఇది పోరాడాల్సిన సమయం: సంజయ్‌ సింగ్‌

ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయం కాదు.. పోరాడాల్సిన సమయమని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మాట్లాడారు.

Published : 03 Apr 2024 22:46 IST

దిల్లీ: ఆప్‌ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ ఇవ్వడంతో ఆయన బుధవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి దాదాపు ఆరు నెలల తర్వాత బయటకు వచ్చిన ఆయనకు ఆప్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తిహాడ్‌ జైలులో గేటు నంబర్‌ 3 నుంచి బయటకు వచ్చిన సంజయ్‌ సింగ్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపించారు. మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులకు వాహనంపై నుంచి అభివాదం చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌సింగ్‌ మాట్లాడుతూ..‘‘ఇది పోరాడాల్సిన సమయం. అరవింద్‌ కేజ్రీవాల్‌ జిందాబాద్‌. జైలుకు వెళ్లిన నేతలు కూడా త్వరలోనే బయటకు వస్తారు. ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయం కాదు.. పోరాడే సమయం’’ అన్నారు. జైలు నుంచి నేరుగా  కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లిన ఆయన.. సీఎం సతీమణి సునీత కేజ్రీవాల్‌ను కలిసి మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని