High Court: ఆప్‌ ఆఫీస్‌ స్థలంపై నిర్ణయం తీసుకోండి.. కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపుపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని దిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

Published : 05 Jun 2024 18:27 IST

దిల్లీ: అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే దిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP) కార్యాలయానికి స్థలం కేటాయించాలని దిల్లీ హైకోర్టు(High Court) కేంద్రాన్ని (Centre) ఆదేశించింది. ఈ విషయంపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

అన్ని రాజకీయ పార్టీలకు దిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే అధికారం ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్ తెలిపారు. స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల కేటాయించలేకపోతున్నామని చెప్పడం కారణంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. దీనిపై కేంద్రం వెంటనే స్పందించి కార్యాలయానికి భూమిని కేటాయించాలని ఆదేశించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడంతో దిల్లీలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కేటాయించాలని గతంలో కేంద్రాన్ని కోరింది. జూన్ 15లోగా పార్టీ ప్రస్తుత కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉందని.. వీలైనంత త్వరగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌(డీడీయూ మార్గ్‌)లోని మంత్రిత్వ శాఖల వద్ద కొంత భాగాన్ని తాత్కాలికంగా కార్యాలయ ఏర్పాటుకు కేటాయించాలని ఆప్‌ తరపు న్యాయవాది కోర్టును కోరారు.

ప్రస్తుత ఆప్‌ కార్యాలయం ఉన్న భూమిని దిల్లీ హైకోర్టుకు కేటాయించినట్లు మార్చిలో పేర్కొన్న సుప్రీం కోర్టు.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ఆప్‌నకు జూన్ 15 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు