Aditya L1: సౌర తుపాన్‌ను క్లిక్‌మనిపించిన ఆదిత్య-ఎల్‌1

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌకలోని రెండు రిమోట్‌ సెన్సింగ్‌ పరికరాలు ఇటీవల ఒక సౌర తుపాన్‌ను తమ కెమెరాల్లో బంధించాయి.

Published : 11 Jun 2024 04:58 IST

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌకలోని రెండు రిమోట్‌ సెన్సింగ్‌ పరికరాలు ఇటీవల ఒక సౌర తుపాన్‌ను తమ కెమెరాల్లో బంధించాయి. సోలార్‌ అల్ట్రా వయలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (సూట్‌), విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనోగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)లు ఈ ఘనత సాధించాయి. మే నెలలో సౌర తుపాన్ల కారణంగా వెలువడ్డ ఎక్స్, ఎం తరగతి జ్వాలలు ఇందులో కనిపించాయి. ఏఆర్‌ 13664 అనే క్రియాశీల ప్రాంతంలో ఈ పరిణామం జరిగింది. దీనివల్ల భూఅయస్కాంత తుపాన్లు తలెత్తాయి. ఆదిత్య ఎల్‌-1ను ఇస్రో గత ఏడాది సెప్టెంబరులో ప్రయోగించింది. ఆ వ్యోమనౌక రోదసిలో 127 రోజులు ప్రయాణించి ఈ ఏడాది జనవరి 6న లగ్రాంజ్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) అనే స్థానానికి చేరుకుంది. అది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని