Raghav chadha: శస్త్రచికిత్స అనంతరం కేజ్రీవాల్‌ నివాసానికి రాఘవ్‌ చద్దా

శస్త్రచికిత్స అనంతరం ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్‌ చద్దా మొదటి సారిగా దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో కనిపించారు.

Published : 18 May 2024 13:42 IST

దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ (Raghav chadha) చద్దా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal)ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్‌ వెళ్లిన చద్దా  పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడంపై రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి.

దీనిపై దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పష్టతనిస్తూ “రాఘవ్ చద్దాకు తీవ్రమైన కంటి సమస్య ఉండడంతో లండన్‌లో కంటి శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. వెంటనే చికిత్స చేయకపోతే ఆయనకు అంధత్వం వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఎన్నికల సమయమైనా వెళ్లాల్సి వచ్చింది. చద్దా కోలుకున్న వెంటనే  ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు’’అని తెలిపారు. చికిత్స అనంతరం చద్దా బయట కనిపించడం ఇదే తొలిసారి. దిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్న సమయంలో లండన్‌లో ఉన్న చద్దా ఆప్‌ ప్రచార కార్యక్రమాల్లో సునీత కేజ్రీవాల్ నిర్వహిస్తున్న సమావేశాలు, ప్రసంగాలను తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.  ఈ నేపథ్యంలో నెల రోజుల అనంతరం రాహుల్‌ చద్దా శనివారం సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఆప్ పేర్కొన్న 40 మంది స్టార్ క్యాంపెయినర్‌లలో రాఘవ్ చద్దా ఒకరు. జాబితాలో సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, సందీప్ పాఠక్ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని