Amit shah: రాహుల్‌ వచ్చాక కాంగ్రెస్‌ ప్రమాణాలు పడిపోయాయి: అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.

Published : 27 May 2024 16:40 IST

దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై నిప్పులు చెరిగారు. రాహుల్‌ కాంగ్రెస్ లో చేరిన తర్వాత పార్టీ రాజకీయ స్థాయి పాతాళానికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. 

ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌ షా మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ  ప్రతీ విషయానికి సమావేశాలకు హాజరుకాకుండా పార్లమెంటును అగౌరవ పరుస్తుందని అసహనం వ్యక్తంచేశారు.  కేంద్రం చేసిన చట్టాలపై వారు లేవనెత్తే ప్రతీ ప్రశ్నకు తాము సమాధానం చెప్తామని, అయినా కూడా సమావేశాల మధ్యలో లేచి వెళ్లిపోవడం, చర్చలు జరగకుండా ఆపడానికి ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడతారని దుయ్యబట్టారు. ఇవి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు కావా అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్‌లోకి రావడంతో ఆ పార్టీ కార్యకలాపాల్లో  మార్పు వచ్చిందని, అప్పటినుంచి పార్టీ ప్రమాణాలు పడిపోయాయన్నారు. గత 20 ఏళ్లుగా  వారు పార్లమెంటును బహిష్కరించడానికి రకరకాల సాకులు చెప్తున్నారన్నారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధానమంత్రి సమాధానం ఇస్తున్నప్పుడు గంటన్నర పాటు ఆయనకు అంతరాయం కలిగించడం నా రాజకీయ చరిత్రలో నేనెప్పుడూ చూడలేదు. దేశ ప్రజలు తమ ఓట్లతో నరేంద్ర మోదీ (PM Modi)ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు. ఆయనను అగౌరవపరచడం రాజ్యాంగ వ్యవస్థను అగౌరవపరచడంతో సమానం’’అని షా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని