Agnibaan: నేడు నింగిలోకి అగ్నిబాణ్‌ రాకెట్‌

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదికగా మంగళవారం ఉదయం అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.

Published : 28 May 2024 05:09 IST

శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) వేదికగా మంగళవారం ఉదయం అగ్నిబాణ్‌ రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. రాకెట్ను రూపొందించిన అగ్నికుల్‌ కాస్మోస్‌ ఏరోస్పేస్‌ సంస్థ ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎనిమిది గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం ప్రైవేట్‌ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5.48 గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్‌ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్‌ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు. ప్రయోగాన్ని సమీక్షించేందుకు ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ సోమవారం సాయంత్రం షార్‌కు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు