Gold Smuggling: మలద్వారంలో కేజీ బంగారం దాచి.. ఎయిర్‌హోస్టెస్‌ స్మగ్లింగ్‌

Gold Smuggling: బంగారం అక్రమ రవాణా చేస్తూ ఓ ఎయిర్‌హోస్టెస్‌ అధికారులకు చిక్కింది. ఆమె మలద్వారంలో దాదాపు కిలో బంగారాన్ని దాచి స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు.

Published : 31 May 2024 13:21 IST

కన్నూర్‌: దేశంలోకి బంగారం అక్రమ రవాణాను అధికారులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నప్పటికీ కొందరు స్మగ్లింగ్‌ (Gold Smuggling) కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళలో ఓ విమానయాన సంస్థ మహిళా ఉద్యోగి (Air hostess) ఈ అక్రమ రవాణాకు యత్నిస్తూ అధికారులకు చిక్కింది. నిందితురాలు తన రహస్య అవయవాల్లో కేజీ బంగారాన్ని దాచినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మే 28న మస్కట్‌ నుంచి కన్నూర్‌ ఎయిర్‌పోర్టు (Kannur Airport)కు ఓ విమానం చేరుకుంది. అందులో బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఆ విమానంలో ఎయిర్‌హోస్టెస్‌ (Air hostess)గా ఉన్న సురభి ఖాతూన్‌ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మలద్వారం (Rectum)లో 960 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

కేరళ రాజకీయాల్లో మళ్లీ స్మగ్లింగ్‌ కలకలం.. అరకేజీ బంగారంతో చిక్కిన శశిథరూర్‌ పీఏ

విచారణ అనంతరం నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల కస్టడీ విధించింది. ఆమెను కన్నూర్‌ మహిళా జైలుకు తరలించారు. ఎయిర్‌లైన్‌కు చెందిన సిబ్బంది ఇలా రహస్య భాగాల్లో బంగారాన్ని స్మగ్లింగ్‌ (Gold Smuggling) చేయడం దేశంలో ఇదే తొలిసారని డీఆర్‌ఐ వర్గాలు వెల్లడించాయి.

గత కొన్నేళ్లుగా కేరళ (Kerala News)లో ఈ బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. ఆ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రిపైనా ఈ ఆరోపణలు రాగా.. ఇటీవల పసిడి అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సహాయకుడి (Shashi Tharoor's Aide)ని దిల్లీలో అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు