Air India: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఎయిరిండియా కీలక నిర్ణయం..!

ఇజ్రాయెల్‌ మీద ఇరాన్‌(Iran) విరుచుకుపడుతుందన్న అంచనాలతో విమానయాన సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

Updated : 13 Apr 2024 16:30 IST

దిల్లీ: డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌ (Israel)పై ఇరాన్‌ (Iran) విరుచుకుపడుతుందన్న అంచనాలు పశ్చిమాసియాలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌ గగనతలం మీదుగా రాకపోకలను నిలిపివేసినట్లు సమాచారం. దాంతో ఐరోపాకు వెళ్లే విమానాలు సుదీర్గ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇతర దేశాల సంస్థలు కూడా ఇదే బాటపట్టాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో తమ సీనియర్ కమాండర్లు మృతి చెందినట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ వెల్లడించింది. ఇది బెంజమిన్ నెతన్యాహూ సేనల పనేనని, ఈ నేరానికి వారు పశ్చాత్తాపపడేలా చేస్తామని ఇరాన్‌ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖొమేనీ హెచ్చరించారు. అప్పటి నుంచి ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.

ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్‌ (Israel), ఇరాన్‌లకు ప్రయాణం చేయవద్దని మన పౌరులను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ రెండు దేశాల్లో ఉంటున్న వారు స్థానిక భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు