Air India: విమానంలో భద్రతకు ‘క్లాసికల్‌’ టచ్‌.. ఎయిరిండియా ఐడియా అదుర్స్‌

విమానం ఎక్కిన మొదలు ల్యాండింగ్‌ వరకు ప్రయాణికులు పాటించాల్సిన భద్రతా సూచనలకు సంబంధించి క్లాసికల్‌ వీడియోను ఎయిరిండియా రూపొందించింది. ఈ అద్భుత దృశ్యాలను మీరూ చూసేయండి..  

Updated : 24 Feb 2024 11:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమాన ప్రయాణాల్లో భద్రతా సూచనలు పాటించాలంటూ ఎయిర్‌ హోస్ట్‌, మైక్‌ల ద్వారా ప్రయాణికులకు ఆయా సంస్థలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా ఓ విన్నూత ఆలోచన చేసింది. తమ ప్రయాణికుల రక్షణ నిమిత్తం ఈ భద్రతకు క్లాసికల్‌ టచ్‌ ఇచ్చింది. భారత్‌లో ప్రముఖ సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, బిహు, కథాకళి, కథక్‌, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్‌లను సమ్మిళితం చేసి ఒక వీడియోను రూపొందించింది.

సీటు బెల్టు ఎలా పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ వేళ ఏం చేయాలి.. ఇలా అనేక అంశాలను విమానం ఎక్కిన మొదలు దిగేంత వరకు ఎలా పాటించాలో నృత్యం రూపంలో వివరించింది. ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా దర్శకుడు భరత్‌ బాల, గాయకుడు శంకర్‌ మహదేవన్‌, మోక్‌కాన్‌ వరల్డ్‌ గ్రూప్‌కు చెందిన ప్రసూన్‌ జోషి చిత్రీకరించారు.

ఎయిరిండియా ఈ వీడియోను తొలుత A350 విమానంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు దీన్ని ఎన్ని సార్లైనా చూసే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ వీడియోను తమ విమానాల్లో ప్రదర్శించనున్నట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని