Akhilesh Yadav: అఖిలేశ్‌కు సీబీఐ సమన్లు..!

అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌(Akhilesh Yadav)ను సీబీఐ విచారణకు పిలిచింది. 

Updated : 28 Feb 2024 15:26 IST

లఖ్‌నవూ: ఎస్పీ చీఫ్, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌(Akhilesh Yadav)కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు(Illegal Mining Case) విచారణలో భాగంగా సాక్షిగా ఆయన్ను పిలిచింది. రేపు ఆయన్ను ప్రశ్నించనున్నామని దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి.

అక్రమ మైనింగ్‌కు సంబంధించి రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి 2016 మధ్యకాలంలో నిబంధనలను ఉల్లంఘించి అధికారులు గనులను కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. అఖిలేశ్‌.. 2012 నుంచి 2017 మధ్యకాలంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2012-13లో మైనింగ్ మంత్రిత్వశాఖ బాధ్యతలు పర్యవేక్షించారు.

ఇదిలాఉంటే.. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి భారత్‌ జోడో న్యాయ యాత్రలో అఖిలేశ్ పాల్గొన్నారు. యూపీలోని ఆగ్రాకు యాత్ర చేరుకున్న సమయంలో ఆయన మద్దతు ప్రకటించారు. ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని