Jodo Nyay Yatra: జోడో యాత్ర.. చేతులు కలిపిన రాహుల్‌ గాంధీ-అఖిలేశ్‌

రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) పాల్గొన్నారు.

Published : 25 Feb 2024 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపాను ఎదుర్కొనేందుకు కలిసి పోటీ చేసే విషయమై విపక్ష పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) పాల్గొన్నారు. యూపీలోని ఆగ్రాకు యాత్ర చేరుకున్న సమయంలో అఖిలేశ్‌ పాల్గొని మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో వేదికపై ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు.

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర మొదలైన అనంతరం విపక్ష పార్టీలకు చెందిన ఓ కీలక నేత ఇందులో పాల్గొనడం ఇదే మొదటిసారి. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌లో యాత్ర కొనసాగుతున్న సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొనే అవకాశాలున్నాయని వార్తలు వచ్చినప్పటికీ ఆమె మాత్రం ఇందుకు దూరంగా ఉన్నారు. యూపీలో కాంగ్రెస్‌-ఎస్పీ మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిన కొన్ని రోజులకే అఖిలేశ్‌ ఇందులో పాల్గొనడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించగా.. ఎస్పీ 63 చోట్ల పోటీ చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని