Gyanvapi mosque: జ్ఞానవాపిలోని శివలింగానికి కార్బన్‌డేటింగ్‌

జ్ఞానవాపి మసీదులో లభ్యమైన శివలింగానికి కార్బన్‌డేటింగ్‌ నిర్వహించేందుకు అలహాబాద్‌ హైకోర్టు అనుమతిచ్చింది.

Published : 12 May 2023 22:02 IST

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar pradesh) జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులోని వాజూఖానాలో లభించిన శివలింగానికి కార్బన్‌ డేటింగ్‌ (corbon dating) నిర్వహించేందుకు అలహాబాద్‌ హైకోర్టు అనుమతిచ్చింది. హిందూపక్ష వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. శివలింగం దెబ్బతినకుండా అత్యాధునిక టెక్నాలజీతో కార్బన్‌డేటింగ్‌ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

వివాదాస్పదమైన జ్ఞానవాపి మసీదులో లభ్యమైన శివలింగం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్‌డేటింగ్‌ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గత ఏడాది అక్టోబరు 14న వారణాశి జిల్లా కోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ.. కొందరు హిందుత్వ వాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కార్బన్‌ డేటింగ్‌కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది.

ఇదిలా ఉంటే, జ్ఞానవాపి కేసు విచారణలో భాగంగా సర్వే చేపట్టాలని వారణాసి న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం గతంలోనే సర్వే పూర్తి చేసింది. ఆ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి.. నివేదికను కోర్టుకు అందజేసింది. అనంతరం సర్వే నివేదికలోని అంశాలు బహిర్గతం కావడం వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్‌ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు