- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
us: కొవిడ్ వ్యాక్సిన్‌లో మైక్రోచిప్ ఉందట!
వాషింగ్టన్: అమెరికాలో ఉన్నవి పక్షులు కాదు.. రోబోలు అనే సిద్ధాంతాన్ని నమ్మే కొందరు ఇటీవల అమెరికాలో ధర్నా నిర్వహించారనే వార్తలు చూశాం. కానీ, ఆ సిద్ధాంతానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. అయితే, కరోనా వ్యాక్సిన్ల విషయంలో కూడా మరో సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ప్రజలకు వేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్లలో మైక్రోచిప్స్ ఉన్నాయని కొందరు అమెరికన్లు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ల ద్వారా మైక్రోచిప్‌ను మనిషిలోకి ఎక్కించి దాంతో వారిని ట్రాక్ చేస్తున్నారని.. అసలు ఈ కరోనా మహమ్మారిని సృష్టించిందే మైక్రోచిప్స్‌ను మనుషుల్లోకి చొప్పించడానికి ఓ నిరాధార సిద్ధాంతాన్ని లేవనెత్తారు. అమెరికన్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతుండటం గమనార్హం.
ఇదే విషయంపై ఓ అంతర్జాతీయ పత్రికతో కలిసి మైగావ్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. మొత్తంగా 20శాతం మంది అమెరికన్లు వ్యాక్సిన్‌లో మైక్రోచిప్ ఉంటుందని భావిస్తున్నారట. వారిలో 30-44 మధ్య వయస్కులు ఎక్కువగా ఉన్నట్లు సంస్థ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది ఇది తప్పుడు సమాచారమని కొట్టిపారేస్తుండగా.. 7శాతం మంది నిజంగానే వ్యాక్సిన్‌లో మైక్రోచిప్ ఉంటుందని నమ్ముతున్నారు. మరో 20శాతం మంది బహుశా నిజమే అయి ఉంటుందని చెప్పారట. వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరిస్తున్న వారిలో 51శాతం మంది వ్యాక్సిన్లలో మైక్రోచిప్ ఉంటుందన్న అనుమానంతోనే వ్యాక్సిన్ వేసుకోవట్లేదని తెలిపారట.
అయితే, ఈ సిద్ధాంతం తప్పని, వ్యాక్సిన్లలో మైక్రోచిప్ పెడుతున్నట్లు నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా ఈ కుట్ర సిద్ధాంతం ప్రజల దృష్టికి వెళ్లడంతో కొంతమంది ఆసక్తికరంగా ఉందని గుడ్డిగా నమ్మేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు, సమాచారాలపై గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ స్పందించారు. ‘మనం చేసే పోరాటం కేవలం వైరస్‌తోనే కాదు.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకునే చర్యలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోన్న ట్రోల్స్, కుట్ర సిద్ధాంతాలపై కూడా’’అని అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
-
India News
రాజస్థాన్‌ను వణికిస్తోన్న లంపీ స్కిన్ వ్యాధి.. 18వేల మూగజీవాల మృతి
-
Movies News
హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
-
Politics News
Kejriwal: ‘ఆప్‌ని గెలిపిస్తే..’ గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు
-
Sports News
Imram Tahir : తాహిర్‌కు రొనాల్డో పూనాడు.. వికెట్ సంబరం ఎలా చేశాడో చూసేయండి..!
-
Movies News
Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- RRR: ఆస్కార్‌కు ‘ఆర్ఆర్ఆర్’.. నామినేట్ అయ్యే ఛాన్స్ ఎంతంటే?
- Ponniyin Selvan: ఆ ఫార్మాట్లో విడుదలవుతున్న తొలి తమిళ సినిమా!
- Early Puberty: ముందే రజస్వల.. ఎందుకిలా?!
- Imram Tahir : తాహిర్‌కు రొనాల్డో పూనాడు.. వికెట్ సంబరం ఎలా చేశాడో చూసేయండి..!
- Hardik : హార్దిక్ ఫుల్ స్వింగ్‌లో ఉంటే భారత్‌ను తట్టుకోలేం: జింబాబ్వే బ్యాటింగ్ కోచ్
- హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Kejriwal: ‘ఆప్‌ని గెలిపిస్తే..’ గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు