CAA: సీఏఏ త్వరలో అమల్లోకి రానుందా... వైరల్‌గా అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌ కార్ల నంబర్‌ ప్లేట్లు

కేంద్ర ప్రభుత్వం త్వరలో పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలు చేయబోతోందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Updated : 02 Mar 2024 19:56 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)  అమలు చేయబోతోందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనికి కారణం కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ల కార్లకు ఉన్న నంబర్‌ ప్లేట్లు. 

దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భాజపా ఎన్నికల సంఘం సమావేశానికి హాజరైన హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath Singh)ల కారు నంబరు ప్లేట్లపై  ఉన్న సంఖ్యల మధ్యలో CAA అని ఉండడంతో  ప్రభుత్వం త్వరలో ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నట్లు సంకేతాలు ఇస్తోందా అనే ప్రశ్నలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి.

లోక్‌సభ ఎన్నికలకు ముందే 2019లో రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తూ, సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే సీఏఏ అమలవుతోంది. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని