Anand Mahindra: ఇ-రూపీ వాడి.. పండ్లు కొన్న మహీంద్రా..!

ఇ-రూపీతో లావాదేవీలు నిర్వహించినట్లు వెల్లడించారు వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra). ఈ మేరకు ట్విటర్‌లో వీడియో షేర్ చేశారు. 

Published : 26 Jan 2023 01:35 IST

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra) కొత్త విషయాలను పంచుకోవడంలో ముందుంటారు. తాజాగా ఆయన ఇ-రూపీ( E-Rupee) విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. అలాగే ఆయన షేర్ చేసిన వీడియోలో డిజిటల్ రూపీతో జరిగిన లావాదేవీ కనిపిస్తోంది. 

‘ఈ రోజు రిజర్వ్‌ బ్యాంకు(RBI) బోర్డు మీటింగ్‌లో నేను డిజిటల్‌ కరెన్సీ ఇ-రూపీ గురించి తెలుసుకున్నాను. ఆ సమావేశం తర్వాత దగ్గర్లోని పండ్ల విక్రయదారుడి వద్దకు వెళ్లాను. ఇ-రూపీ వెసులుబాటు ఉన్న కొందరిలో ఆయన కూడా ఒకరు. ఆచరణలో డిజిటల్ ఇండియా’ అని వెల్లడించారు. అలాగే తాను దానిమ్మకాయలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. 

రిజర్వ్ బ్యాంక్ (RBI) డిసెంబర్‌లో డిజిటల్ రూపీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది భారతదేశ సొంత డిజిటల్ కరెన్సీ. దీనిని ఇ-రూపీ లేదా డిజిటల్ రూపీ లేదా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(CBDC)గా వ్యవహరిస్తారు. బ్యాంకు నోట్ల మాదిరిగానే ఉంటుంది. కానీ, డిజిటల్‌ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దీనిని జారీ చేస్తుంది. అలాగే నియంత్రిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు