Republic Day parade: ఆకట్టుకున్న 1900 చీరల ప్రదర్శన

రిపబ్లిక్‌ డే(Republic Day) రోజున.. దేశ రాజధాని దిల్లీలో పలు ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా చేసిన ఏర్పాట్లు, కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. 

Updated : 26 Jan 2024 15:32 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు (Republic Day) అంబరాన్నంటాయి. దిల్లీలో జరిగిన పరేడ్‌లో వీక్షకుల కోసం ఏర్పాటుచేసిన సిటింగ్ ఏరియా ఆకట్టుకుంది. ఇక్కడ 1900 చీరలను ప్రదర్శించారు. ‘అనంత్‌ సూత్ర’ పేరిట దేశంలోని పలు ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటుచేశారు. వాటిపై ఉన్న క్యూఆర్‌ కోడ్స్‌ను స్కాన్‌ చేసి చీరల అల్లిక, ఎంబ్రాయిడరీ గురించి తెలుసుకునే వీలు కల్పించారు.

  • కర్తవ్యపథ్‌ నుంచి 13 వేల మంది అతిథులు ఈ వేడుకలను వీక్షించారు. వారిలో అంతరిక్ష రంగ శాస్త్రవేత్తలు, సర్పంచులు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు తదితరులు ఉన్నారు. 
  • వీరగాథ ప్రాజెక్టుకు చెందిన సూపర్‌ 100 విజేతలు కూడా ఈ ప్రత్యేక అతిథుల్లో ఉన్నారు. వీరగాథ మూడవ అడిషన్ గతేడాది జులై 13 నుంచి సెప్టెంబర్ 30 మధ్య జరిగింది. రికార్డు స్థాయిలో 2.42 లక్షల పాఠశాలలకు చెందిన 1.36 కోట్ల మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. వారంతా వ్యాసాలు, పద్యాలు,  డ్రాయింగ్‌ ద్వారా తమ స్ఫూర్తిదాయక కథనాలను పంచుకున్నారు. 
  • ‘వందే భారతమ్‌-నారీ శక్తి’ పేరిట 1500 మంది డ్యాన్సర్లు..  తమ ప్రదర్శన ద్వారా భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని అందించారు. వారు 30 రకాల నృత్యరీతుల్ని ప్రదర్శించారు. వాటిలో కూచిపూడి, కథక్‌, భరతనాట్యం, మణిపురి, బాలీవుడ్‌ స్టైల్స్‌ ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని