‘మరీ అంత నిజాయతీ వద్దేమో’: ఎన్నికల ఫలితాలపై ప్రముఖ నటుడి పోస్టు వైరల్‌

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కాస్త భిన్నంగా వాస్తవ ఫలితాలు కనిపించాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher ) పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. 

Updated : 05 Jun 2024 12:14 IST

దిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల్లో 240 సీట్లు గెలుచుకొని భాజపా(BJP) ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు, ఫలితాలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గంలో కూడా పరాజయం పాలుకావడం భాజపాకు దిగ్భ్రాంతి కలిగించేదే. ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీగా సీట్లకు కోత పడింది. ఈ సమయంలో ప్రముఖ నటుడు అనుపమ్‌ఖేర్ (Anupam Kher) పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.

‘‘నిజాయతీపరుడైన వ్యక్తి మరీ నిజాయతీగా ఉండకూడదని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంటుంది. నిటారుగా ఉన్న చెట్టు పైనే సహజంగా గొడ్డలి వేటు పడుతుంటుంది. నిజాయతీపరుడు తన జీవితంలో ఎన్నో సమస్యల్ని భరించాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా.. నిజాయతీని వదులుకోడు. అందుకే ఆ వ్యక్తి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాడు’’ అంటూ ఎవరి పేరు ప్రస్తావించకుండా తన అభిప్రాయం వ్యక్తంచేశారు.

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. భాజపా సాధించిన ఫలితాలపై అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. భాజపాకు కొన్నిచోట్ల అనుకోని ఓటములు ఎదురైనా.. మరికొన్నిచోట్ల అనూహ్య విజయాలు సొంతం అయ్యాయి. ‘‘మూడోసారి కూడా ప్రజలు ఎన్డీయేపై విశ్వాసం ఉంచారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు గత దశాబ్దకాలంగా చేసిన మంచి పనుల్ని కొనసాగిస్తాం’’ అని ఫలితాల అనంతరం మోదీ స్పందించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని