Arvind Kejriwal: ఈడీ కస్టడీ చట్టవిరుద్ధం.. దిల్లీ హైకోర్టు తలుపుతట్టిన కేజ్రీవాల్‌

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఈడీ కస్టడీకి పంపడం చట్టవిరుద్ధమని వెంటనే విడుదల చేయాలని కోరారు.

Updated : 23 Mar 2024 19:27 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీ హైకోర్టు తలుపుతట్టారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేశారు. ఆయన్ని ఈడీ కస్టడీకి అప్పగించడం చట్టవిరుద్ధమని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యవసర పిటిషన్‌ కింద విచారణ చేపట్టి.. వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.

దిల్లీలోని కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన్ను గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రౌస్‌ అవెన్యూ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది. ఈ విచారణ సందర్భంగా మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి కేజ్రీవాలేనని ఈడీ ఆరోపించింది. ఆయన కేబినెట్‌లోని మంత్రులు, ఆప్‌ నేతలు ఈ కుట్రలో భాగస్వాములని తెలిపింది. 10 రోజుల కస్టడీకి అనుమతివ్వాలని కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. తిరిగి మార్చి 28న కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని